Wednesday, April 30, 2025
HomeఆటNZ vs PAK: పాక్‌తో సిరీస్.. న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్

NZ vs PAK: పాక్‌తో సిరీస్.. న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్

స్వ‌దేశంలో పాకిస్థాన్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచ్‌ల(NZ vs PAK) టీ20ల సిరీస్‌కు న్యూజిలాండ్ జ‌ట్టును కివీస్ బోర్టు ప్రకటించింది. అయితే రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, ఐపీఎల్‌లో ఆడ‌నుండ‌డంతో ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండరని తెలిపింది. దీంతో ఆల్‌రౌండ‌ర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ను కెప్టెన్‌గా నియ‌మించింది. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, జేమ్స్ నీషమ్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య మార్చి 16న టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే పాకిస్థాన్ బోర్టు తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కివీస్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, మిచ్ హే, డారిల్ మిచెల్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, జాక్ ఫౌల్క్స్, హెన్రీ (నాలుగు, ఐదు టీ20ల‌కు మాత్ర‌మే), కైల్ జామిసన్, జిమ్మీ నీషమ్, విల్ ఓ’రూర్కే (తొలి మూడు టీ20ల‌కు మాత్ర‌మే).

పాక్ జట్టు: అఘా సల్మాన్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ అలీ, మహమ్మద్ హారిస్, ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసఫ్, షాహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్, ఉస్మాన్ ఖాన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News