Wednesday, March 12, 2025
HomeతెలంగాణBalkampet Temple: బల్కంపేట ఆలయ అభివృద్ధికి కేంద్రం ఆమోదం.. కిషన్ రెడ్డి హర్షం

Balkampet Temple: బల్కంపేట ఆలయ అభివృద్ధికి కేంద్రం ఆమోదం.. కిషన్ రెడ్డి హర్షం

దేశంలో ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రసాద్’ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం కింద హైదరాబాద్‌లోని బల్కంపేట(Balkampet temple) రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా వెల్లడించారు. రూ. 4.21 కోట్ల వ్యయంతో ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. రేణుకా ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోడీ(PM Modi, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం భక్తులకు సౌకర్యాలను పెంచడమే కాకుండా హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News