భీమవరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర బధిర పాఠశాలలోని మహిళా అధ్యాపకులను ప్రిన్సిపల్ పి. పద్మనాభరాజు లైంగికంగా వేధిస్తున్నారని(Sexual harassment) వాపోతున్నారు. తమను అనరాని మాటలు అంటున్నారని, ఇంటికి వెళ్ళి భర్తకు కూడా చెప్పులేని మాటలు ప్రిన్సిపల్ అంటున్నారంటూ మహిళ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టల్ కు అర్ధరాత్రి వేళ వచ్చి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోయారు. పాఠశాలలో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు మూగ, చెవిటి దివ్యాంగ పిల్లలు 80 మంది పైగా చదువుకుంటున్నారు.
విద్యార్థులు పాఠశాల ఆవరణలోని చెట్ల పళ్ళు తింటున్నారని పచ్చని చెట్లను సైతం కొట్టించడమే కాక టీటీడీ దేవస్థానం అందిస్తున్న భోజనం సైతం విద్యార్థులకు పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని బధిర విద్యార్థులు సైగలతో చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.