తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు(Group-2 Results) విడుదల అయ్యాయి. టీజీపీఎస్సీ(TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్స్, తుది కీ, మాస్టర్ క్వశ్చన్పేపర్లను TGPSC వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
గతేడాది డిసెంబర్లో మొత్తం 783 గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 5,51,943మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 15, 16 తేదీలలో నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో పేపర్ -1కు 2,57,981 మంది, పేపర్-2కు 2,55,490, పేపర్ -3కు 2,51,738, పేపర్- 4కు 2,51,486మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా సోమవారం గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.