సిన్సియర్ అధికారిగా పేరు ఉన్న టీజీఆర్టీసీ(TGRTC) ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar)పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఏకంగా ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీ(PM Modi), సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు లేఖ రాశారు. ఈ లేఖలో సజ్జనార్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఆర్టీసీకి చెందిన 400 మంది కార్మికులను ఇటీవల సస్పెండ్ చేశారు. దీంతో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. చిన్న చిన్న పొరపాట్లకు తమను ఉద్యోగం నుండి తొలగించి తమ కుటుంబాలను రోడ్డున పడేశారని సజ్జనార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జనార్ మాత్రం పెద్ద పెద్ద స్కాంలు చేస్తూ ప్రశాంతంగా ఉన్నారని ఓ మహిళా కండక్టర్ కంటతడి పెట్టుకుంది. చిన్న చిన్న ఉద్యోగులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించవద్దని కోరారు. ప్రజల మధ్య ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయని వాటిని సరిదిద్దాల్సింది పోయి ఇలా చేయడం ఏంటని నిలదీశారు. అందుకే సజ్జనార్ చేసిన అనైతిక పనులతో పాటు అవినీతికి సంబంధించిన అంశాలపై ప్రధాని, సీఎంకు తొమ్మిది పేజీల లేఖ రాశామని వెల్లడించారు.