మార్చి నెల ప్రారంభంలో బంగారం ధరలు కొంత తగ్గినప్పటికీ, తాజాగా ధరలు మళ్లీ పెరుగుతూ తగ్గుతూ ఒడిదుడుకులకు గురి అవుతున్నాయి. మార్చి 9న 22 క్యారట్ల బంగారం ధర రూ.8040 కాగా, 24 క్యారట్ల ధర రూ.8771 గా నమోదైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ధరలు మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు గణనీయంగా పెరగడం సామాన్య ప్రజలు, వ్యాపారులు, పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. అయితే మార్చి ప్రారంభంలో కొంత ఉపశమనం లభించినట్టుగా కనపడింది. కానీ ఈ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు.
మార్చి 10న 22 క్యారట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.8050 కి చేరింది. అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.11 పెరిగి రూ.8782 కి చేరింది. మార్చి 11న మళ్లీ ధరలు తగ్గాయి. 22 క్యారట్ల బంగారం ధర రూ.30 తగ్గి రూ.8020 గా, 24 క్యారట్ల బంగారం ధర రూ.33 తగ్గి రూ.8749 గా నమోదైంది.
అయితే తాజాగా ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు 22 క్యారట్ల బంగారం ధర రూ.45 పెరిగి రూ.8065 కి చేరింది. అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.49 పెరిగి రూ.8798 కి చేరింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండటం మంచిదని సూచిస్తున్నారు. త్వరలో బంగారం ధరలు తగ్గే అవకాశముందని వారు అంటున్నారు. ధరలు తక్కువ సమయంలో కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు.