Wednesday, March 12, 2025
HomeతెలంగాణTG Budget : తెలంగాణ రాష్ట్రానికి రైతులే ఆత్మ: బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్

TG Budget : తెలంగాణ రాష్ట్రానికి రైతులే ఆత్మ: బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ (Budget Sessions)సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ(Governor Jishnu Dev Sharma) ప్రసంగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ జడ్జెట్ అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతుందని గవర్నర్ వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అన్ని వర్గాలే అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. రైతులు , మహిళలు, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని అన్నారు.

ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో మహానుభావులు కృషి చేశారని గుర్తు చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామన్నారు. సామాజిక న్యాయం, అభివృధ్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామని చెప్పారు. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తుందన్నారు.

రాష్ట్రానికి రైతులే ఆత్మ అని చెప్పారు. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందన్నారు. దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అన్నదాతల రుణమాఫీ చేశామన్నారు. ఇదే మా ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News