Wednesday, March 12, 2025
HomeNewscyber fraud: పాత ఫోన్లను ఇచ్చి.. ప్లాస్టిక్ వస్తువులు తీసుకుంటున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్టే..!! 

cyber fraud: పాత ఫోన్లను ఇచ్చి.. ప్లాస్టిక్ వస్తువులు తీసుకుంటున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్టే..!! 

పొద్దుగాలే బహుమతుల ఎర వేసి పాత ఫోన్లను సేకరించేందుకు పలువురు వస్తుంటారు. మీ పాత ఫోన్లను తీసుకురండి.. ప్లాస్టిక్ వస్తువులను సొంతం చేసుకోండి. ఒక పాత సెల్ ఫోన్ కి ఓ ప్లాస్టిక్ డబ్బా ఇస్తామని సౌండ్ బాక్సులతో వాయించేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ముఠా గుట్టునే ఆదిలాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు.

మన పాత మెుబైల్ ఫోన్ డేటా ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడేందుకు పన్నిన భారీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఐదుగురు అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు వేల 125 పాత మొబైల్ ఫోన్లను, 107 సిమ్ కార్డులను, ఐదు బీహార్ కు చెందిన మోటార్ బైక్ లను ఇంకా 600 మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. భారీ సైబర్ నేరానికి స్కెచ్ వేసిన ఈ ఆరుగురు సైబర్ నేరగాళ్లు బీహార్ రాష్ట్రానికి చెందినవారనన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కథనం మేరకు వివరాలు
బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు నిందితులు ఓ ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడడానికి పథకం వేశారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ పథకం అమలులో భాగంగా ప్రధాన నిందితుడిగా ఉన్న తబారక్ ఈ ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తూ, మిగిలిన ఐదుగురు నిందితులను బీహార్ రాష్ట్రం నుండి ఐదు బైకులతో పాటు తెలంగాణ రాష్ట్రానికి పంపించాడని చెప్పారు. వీరు  ద్విచక్ర వాహనాలపై పల్లె, పట్టణాల్లో తిరుగుతూ పాత మొబైల్ ఫోన్ తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలను, ఇతర కానుకలను ఇస్తామంటూ ఆశచూపి పాత మొబైల్ ఫోన్ లను, సిమ్ కార్డులు,  బ్యాటరీలను సేకరించారు.

పలు సైబర్ నేరాలకు
అలా సేకరించిన మొబైల్ ఫోన్ లలో లభ్యమైన సిమ్ కార్డులు, ఫోన్ ల ద్వారా వివిధ రాష్ట్రాలలోని ప్రజలకు బ్యాంక్ అధికారులమని చెప్పి ఫోన్ చేసి సైబర్ నేరానికి పాల్పడి డబ్బులు సంపాదించాలని కుట్ర పన్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో 12 వేల వరకు మొబైల్ ఫోన్లను సేకరించి, వాటి ద్వారా పలు సైబర్ నేరాలకు పాల్పడ్డారు. అదే తరహాలో దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలని పాల్పడాలని కుట్ర పన్నారు. 

- Advertisement -

పథకం ప్రకారమే
ఈ ఐదుగురు పల్లెలు, పట్టణాల్లో మోటార్ బైకులపై ఇంటింటికి తిరిగి పాత మొబైల్ ఫోన్లను సేకరించి బీహర్ కు తీసుకువెళ్లి వారి నాయకుడు తబారఖ్ కు అప్పగిస్తారు. అతడు తన ఈ ఫోన్లు, సిమ్ కార్డుల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజలకు తన అనుచరుల ద్వారా ఫోన్ చేయించి తాము బ్యాంకు అధికారులమని, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని, మీరు లాటరీలో గెలిచారని నమ్మిస్తూ వారి నుండి ఓటిపి తెలుసుకొని ప్రజల బ్యాంకు అకౌంట్ ల నుండి డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకోవాలని పథకం పన్నారు.

ఐదు మంది అరెస్ట్
ఈ కుట్రను పసిగట్టిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ సైబర్ నేరగాళ్ల ముఠాలోని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరొ నిందితుడు పరారీలో ఉన్నాడు. సైబర్ నేరస్తుల ఈ కుట్రను భగ్నం చేసి వారిని అదుపులోకి తీసుకున్న ఆదిలాబాద్ సైబర్ క్రైం డీఎస్పి హసీబుల్లా, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తదితరులను జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ అభినందించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News