ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్థాపించిన జనసేన(Janasena) పార్టీ అప్పుడే 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. మార్చి 14వ తేదీతో 12వ ఏటలోకి అడుగుపెట్టబోతుంది. అయితే ఈసారి మాత్రం అధికారం చేపట్టి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. దీంతో మార్చి 14న పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆవిర్భావ సభ కనివినీ రీతితో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ భారీ సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పాటను(Janasena Song) పార్టీ నేత నాగబాబు విడుదల చేశారు. ‘జెండర.. జెండర.. జెండర.. సామాన్యుడికి అండరా.. పిడిగిలి బిగించి పట్టారా ఇది జనసేనాని జెండర..’ అంటూ ఈ సాంగ్ పవర్ ఫుల్‌గా సాగింది. ఈ పాటకి దుంపటి శ్రీనివాస్ సాహిత్యం అందించగా.. సింధు కె ప్రసాద్ సంగీతం అందించారు.