తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్(TG Budget) సమావేశాలు ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ(Jishnu Dev Sharma) ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ జడ్జెట్ అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతుందని గవర్నర్ వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అన్ని వర్గాలే అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. రైతులు , మహిళలు, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో మహానుభావులు కృషి చేశారని గుర్తు చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామన్నారు. సామాజిక న్యాయం, అభివృధ్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామని చెప్పారు. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తుందన్నారు.
గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. అది గవర్నర్ ప్రసంగంలా లేదని.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రసంగంలా ఉందని విమర్శించారు. గవర్నర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ అసత్యాలు చెప్పించిందని తెలిపారు. రైతుల సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేదని చెప్పారు. 100 శాతం రైతు రుణమాఫీ కాలేదని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం నెలకొన్నదని చెప్పారు. 20 శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేశారని ఇది సిగ్గు పడాల్సిన విషయమని మండిపడ్డారు.