తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్(Prasad Kumar) అధ్యక్షతన జరిగిన బీఏసీ (BAC) సమావేశం ముగిసింది. స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు (Harish Rao), వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
ఈనెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఇక మార్చి 19న ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 21 నుంచి 26 వరకు బడ్జెట్‌పై సభలో వాడీవేడి చర్చ జరగనుంది. కాగా రూ.3.20 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.