సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kausik Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) కుక్క చావు చస్తారంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని పిచ్చి కుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారంటూ ఆరోపించారు. ప్రజలు పెట్టే శాపనార్థాలు రేవంత్‌కు తప్పకుండా తలుగుతాయని పేర్కొన్నారు.
కాగా బుధవారం ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. స్టేచర్ ఉన్న వారు ప్రజలు దెబ్బకు స్ట్రెచర్ మీద పడ్డారని..ఇక ఇలాగే వ్యవహరిస్తే అటు నుంచి అటు మార్చురీకి వెళ్లడమే అని విమర్శించారు. ఆయన విమర్శలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్షనేత చావు కోరుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టిందని.. వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని సూచిస్తున్నారు.