Thursday, March 13, 2025
HomeతెలంగాణHalf Day Schools: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

Half Day Schools: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొంది.

- Advertisement -

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. ఈ ఆదేశాలను అన్ని పాఠశాలల మేనేజ్‌మెంట్లు అమలు చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News