రాష్ట్ర ప్రజలకు హోలీ పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘సప్తవర్ణ శోభితం.. సకల జనుల సంబురం.. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. రంగుల పండుగను వైభవోపేతంగా జరుపుకోవాలన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే హోలీ సమైక్యతకు అద్దం పడుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసానిచ్చారు. హోలీ పండుగ అందరి కుటుంబాల్లో ఆనందోత్సవాలు నింపాలని సీఎం ఆకాంక్షించారు.