Saturday, March 15, 2025
Homeచిత్ర ప్రభChiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును(Lifetime Achievement Award) ప్రకటించింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించింది. ఈ నెల 19న యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

- Advertisement -

ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు ‘దసరా’ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనూ, బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమాలకు కమిట్ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News