Saturday, March 15, 2025
Homeచిత్ర ప్రభKalyan Ram: ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ డేట్ ఫిక్స్

Kalyan Ram: ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ డేట్ ఫిక్స్

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలనాటి నటి విజయశాంతి(Vijayashanthi) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విజయశాంతి– కళ్యాణ్ రామ్ తల్లికొడుకులుగా నటించబోతున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సోహెల్ ఖాన్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కాంతార’ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. మార్చి 17న టీజర్ రాబోతున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రీ టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ సముద్రం ఒడ్డున షర్ట్ మీద రక్తం మరకలతో ఓ బోట్‌లో కూర్చొని ఉన్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ వేసవి కాలంలో రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News