దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రజలంతా రంగులు పూసుకుంటూ తీన్మార్ డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హోలీ వేడుకల్లో మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MallaReddy) సందడి చేశారు. ఒంటి నిండా రంగులు పూసుకుని అనుచరులతో జాలీగా గడిపారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని తన నివాసం వద్ద నిర్వహించిన హోలీ వేడుకల్లో మాస్ డాన్స్ చేస్తూ అలరించారు. తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మనరాళ్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.