ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురం(Pithapuram)లో జనసేన ఆవిర్భావ దినోత్సవాని( Jana Sena Pary Formation Day)కి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నలు మూల నుంచి భారీ ర్యాలీగా వస్తూనే ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంతా జనాలు వస్తున్నారు. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీసుల బందోబస్త్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి భారీగా జనసేన కార్యకర్తలు తరలివస్తూనే ఉన్నారు. దాదాపుగా ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది హాజరు అవుతున్నట్లు అంచనాలు వేస్తున్నారు.
ప్రతి నియోజవర్గం నుండి 100 కార్లు, 20 బస్సులతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పిఠాపురానికి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా రాత్రిం బవళ్లు కష్టపడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు నడిపారని గుర్తు కు చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఆయన కష్టానికి ఫలితం దక్కిందంటూ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి విశేషమైన ప్రజాదరణ లభిస్తుండడంతో కార్యకర్తల్లో ఉత్సాహం పొంగుతుంది. జనసేన భవిష్యత్ రాజకీయాల్లో మరింత బలంగా ఎదిగే అవకాశం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.