తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీటి బారిన పడి ఎంతో మంది యువత ఆర్థికంగా కుంగిపోవడంతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌ను ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రెటీలు ప్రమెట్ చేస్తుండటంతో ఈజీగా ఆకర్షితులవుతున్నారు. దీంతో ఇలాంటి యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు అప్రమత్తం అయ్యారు.
ఈ క్రమంలో నటి సురేఖ వాణి కూతురు సుప్రీత(Supritha) అలర్ట్ అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు తెలిసో.. తెలియకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారని తెలిపారు. తాను కూడా తెలియక ప్రమోట్ చేశానని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు క్షమాపణలు చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఎంకరేజ్ కావొద్దని, ఈజీ మనీకి అలవాటు పడొద్దని సూచించారు. బెట్టింగ్ యాప్స్ ఉంటే డిలీట్ చేయాలని.. ఈ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని ఫాలో అవొద్దన్నారు.
అలాగే ఇస్టాగ్రామ్ వేదికగా నటి సురేఖావాణి (Surekhavani) సైతం బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా వీడియో పోస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను నమ్మి మోసపోవద్దని తెలిపారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు సైతం అలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయొద్దని కోరారు. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా ఇటీవల యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరో యూట్యూబర్ సన్నీ యాదవ్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.