Saturday, March 15, 2025
HomeదైవంTTD : శ్రీనివాస కళ్యాణోత్సవానికి రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేసిన టీటీడీ ఛైర్మన్

TTD : శ్రీనివాస కళ్యాణోత్సవానికి రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేసిన టీటీడీ ఛైర్మన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని(Chandra Babu) టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, ఈఓ శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి ఉండవల్లి నివాసంలో కలిశారు. రేపు వెంకటపాలంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవాని( Srinivasa kalayanam)కి సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు.

శనివారమే కళ్యాణం
వెంకన్న స్వామి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరగుతున్నాయని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. శనివారం రాజధాని అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో జరగనున్న శ్రీవారి కల్యాణోత్సవ ఏర్పాట్లను ఇప్పటికే ఆయన పరిశీలించారు.

ఏర్పాట్లు
కల్యాణ మహోత్సవ ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు జరిగే శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.

శ్రీనివాస కళ్యాణం జరగటం సంతోషం
అమరావతి పునర్నిర్మాణానికి మొదటి విడతగా రూ.30 వేల కోట్లతో పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జరగనుండటం ఆనందంగా ఉందన్నారు. శ్యామలరావు మాట్లాడుతూ కల్యాణానికి విచ్చేేస భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News