ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలు పాడైపోతున్నాయని వాటిని తమకు అప్పగించాలని గాలి జనార్దనరెడ్డి(Gali Janardhana Reddy) తెలంగాణ హైకోర్టు(TG Highcourt)లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థాయనం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే నగదుతో పాటు రూ.5కోట్ల విలువైన బాండ్లను కూడా విడుదల చేయాలని జనార్దనరెడ్డి, ఆయన కుమార్తె బ్రాహ్మణి, కుమారుడు కిరీటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కూడా హైకోర్టు తిరస్కరించింది.
ఇవి ప్రజాధనంతో కొన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేయడంతో ఈడీ కూడా వీటిపై హక్కులు అడుగుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయిన తర్వాతే అవి ఎవరికి చెందుతాయో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో జనార్దన్ రెడ్డి కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది. కాగా అక్రమ మైనింగ్ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని జనార్థన్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన జైలు జీవితం కూడా గడిపి వచ్చారు.