Saturday, March 15, 2025
HomeదైవంOntimitta: ఒంటిమిట్టలో రమణీయంగా జగదభిరాముని పౌర్ణమి కళ్యాణం

Ontimitta: ఒంటిమిట్టలో రమణీయంగా జగదభిరాముని పౌర్ణమి కళ్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట(Ontimitta)లో రమణీయంగా జగదభిరాముని పౌర్ణమి కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా టిటిడి వేద పండితులు నిర్వహించారు.

స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, పుష్ప మాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. రామయ్య సన్నిధిలో జరిగే కళ్యాణాన్ని తన్మయత్వంతో భక్తులు తిలకించారు. కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, భారీగా భక్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణం : ఈవో
ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించే ఈ కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

భక్తుల రద్దీ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, కల్యాణ వేదిక సమీపంలో ట్రాఫిక్ , భధ్రతా, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిక, స్వామివారి తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News