ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు(Nagababu) ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగబాబుకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -
“ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకి నా అభినందనలు,ఆశీస్సులు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు” అని చిరంజీవి తెలిపారు.