సారీ చెప్పకపోతే పార్లమెంట్ లో రాహుల్ గాంధీకి ఏమాత్రం మాట్లాడే ఛాన్స్ దొరకదు. బీజేపీ ఈ విషయంపై పట్టుబట్టి కూర్చుంది. ఈ సంగతి కాంగ్రెస్ కు అర్థమైనా రాహుల్ మెట్టు దిగే సూచనలు మాత్రం కనిపించటం లేదు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యల కారణంగా పార్లమెంట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొని ఎటువంటి చర్చకూ ఆస్కారం లేకుండా పోతోంది. రాహుల్ తీరుపై బేజారు అవుతున్న ఇతర ప్రాంతీయ పార్టీలు రాహుల్ గాంధీని తమకు బిగ్ బాస్ గా బీజేపీ లెక్కగట్టి పార్లమెంట్ ను వాయిదా వేసుకుని పోతోందని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏమాత్రం కాదని, ఇదంతా బీజేపీ వ్యూహం అంటూ తృణముల్ నిప్పులు చెరుగుతోంది.
నిన్నటి నుంచీ పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లుతూ రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాయి. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాజ్యాంగానికి, దేశానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాహుల్ ప్రసంగించారని కమలనాథులు భగ్గుమంటున్నారు. కాగా తనను ప్రసంగించేందుకు అనుమతిస్తే, తనపై వచ్చిన ఆరోపణలుపై తాను తప్పకుండా పార్లమెంట్ లో ప్రసంగిస్తానంటూ రాహుల్ పార్లమెంట్ వెలుపల వెల్లడించారు.
ప్రతిపక్ష నేతల మైక్రో ఫోన్లను ప్రధాని మోడీ ఆఫ్ చేయిస్తున్నారంటూ, తమకు మాట్లాడే ఛాన్స్ లేకుండా పోతోందని రాహుల్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.