‘స్వర్ణాంధ్ర- స్వఛ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)చెత్త ఊడ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తున్న చంద్రబాబు (Chandrababu) స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీపురు పట్టి చెత్తను శుభ్రం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా తణుకు కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌ను పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక మంత్రి నారా లోకేశ్ కూడా మంగళగిరిలోని ఎకో పార్కులో పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూడా చీపురుపట్టి పార్క్‌లో చెత్తచెదారం ఊడ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.