Saturday, March 15, 2025
Homeచిత్ర ప్రభRobinhood: 'రాబిన్ హుడ్' మూవీలో అదిరిపోయిన వార్న‌ర్‌ లుక్‌

Robinhood: ‘రాబిన్ హుడ్’ మూవీలో అదిరిపోయిన వార్న‌ర్‌ లుక్‌

యూత్ స్టార్ నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్ హుడ్'(Robinhood) అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఛలో, భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై హైప్ పెంచేశాయి.

- Advertisement -

తాజాగా మూవీ యూనిట్ ఓ సర్‌ప్రైజ్ పోస్టర్ విడుదల చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner) ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. మూవీలో వార్న‌ర్‌కు సంబంధించిన లుక్ విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో వార్న‌ర్ అదిరిపోయాడు. ఇక ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది.

కాగా ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ త‌రుపున వార్న‌ర్ చాలా కాలం పాటు ఆడాడు. 2016లో అత‌డి నాయ‌క‌త్వంలోనే హైదరాబాద్ ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. అలాగే తెలుగు పాటలకు వార్నర్ రీల్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News