ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీలు(MP), ఎమ్మెల్యేల(MLA)ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా సమస్యలు తెలుసుకుని అసెంబ్లీ, పార్లమెంట్‌లో పోరాటం చేస్తారో వారికి అవార్డులు(Awards) ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపింది.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పితే ‘ఉత్తమ లెజిస్లేచర్’, పార్లమెంట్‌లో అయితే ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ తరహాలో అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సభలో సభ్యుల పనితీరు, వారి ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని అవార్డు అందజేయనుందని తెలుస్తోంది. కాగా విజేతల ఎంపిక కోసం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీ సూచించిన వారికి అవార్డులు అందిస్తారని తెలుస్తోంది.