తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ వేడి వల్ల చాలా మంది డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్‌లతో బాధపడుతున్నారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి, చల్లదనం అందించడానికి కేవలం నీరు మాత్రమే సరిపోదని, శరీరానికి చల్లదనాన్నిచ్చే పండ్ల రసాలు కూడా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో లభించే సీజనల్ పండ్లలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ సీజనల్ పండ్లను తినడంతో పాటు వాటి జ్యూస్‌లు తాగడం వల్ల శరీరానికి మరింత మేలు జరుగుతుంది. ఈ పండ్లలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, కోల్పోయిన శక్తిని తిరిగి నింపడంలో సహాయపడతాయి.
1. వేసవిలో తక్కువ ధరకు లభించే పండు పుచ్చకాయ. ఈ పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు ఎలక్ట్రోలైట్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పుచ్చకాయ తినడంతో పాటు పుచ్చకాయ రసం తాగడం మంచిది.
2. నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుందని అందరికీ తెలుసు. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, నారింజ పండ్లలో నీరు కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. నారింజ పండ్లు తినడంతో పాటు, అప్పుడప్పుడు నారింజ రసం తాగాలి.
3. వేసవిలో చాలా మంది ఇష్టపడే జ్యూస్ పైనాపిల్. తీపి, పుల్లని రుచి కలిగిన పైనాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిది. పైనాపిల్ చల్లదనాన్నిచ్చే గుణాలను కలిగి ఉండటంతో పాటు హైడ్రేటింగ్ కూడా చేస్తుంది. అందువల్ల, పైనాపిల్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి, శరీర వేడిని తగ్గిస్తుంది.
4. మామిడి పండు వేసవిలో మాత్రమే దొరికే అద్భుతమైన ఫలం. వేసవిలో మామిడి పండ్లు తినడం వల్ల శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి లభిస్తాయి. అంతేకాకుండా మామిడి రసం తాగితే, అది దాహాన్ని తీర్చడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
5. కొబ్బరినీరు అన్ని సీజన్లలో లభించే దాహం తీర్చే పానీయం. మంచినీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. వేసవిలో ఈ రిఫ్రెషింగ్ వాటర్ తాగడం వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందవచ్చు. హీట్ స్ట్రోక్ నుండి ఉపశమనం పొందవచ్చు.
6. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో ఈ బెర్రీలను ఎక్కువగా తీసుకుంటే అది శరీర వేడిని తగ్గించి, వేసవి ఎండ నుండి శరీరాన్ని కాపాడుతుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలతో తయారు చేసిన జ్యూస్‌లు తాగడం వల్ల వేసవిలో శరీరం చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది.