Saturday, November 23, 2024
HomeదైవంSrisailam: మల్లన్న ఇంటల్లుడు..కాళ్లకు కర్రలు కట్టుకుని కర్నాటక నుంచి ..

Srisailam: మల్లన్న ఇంటల్లుడు..కాళ్లకు కర్రలు కట్టుకుని కర్నాటక నుంచి ..

శ్రీశైలం మహా క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వివిధ రకాల వాహనాలలో క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు. అయితే శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవార్లకు దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించే శివరాత్రి ఉగాది బ్రహ్మోత్సవాలకు మాత్రం భక్తులు చాలావరకు పాదయాత్రగా తరలివస్తుంటారు. శివరాత్రికి శివమాల ధరించిన స్వాములైతే నల్లమల ప్రాంతంలోనే వెంకటాపురం నుంచి నాగలూటి, బైర్లుటి, పెద్ద చెరువు, మీదుగా కైలాస ద్వారం చేరుకుని శ్రీశైలం విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు తిలకించి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

- Advertisement -

కర్నాటక నుంచి కాళ్లకు కర్రలకు కట్టుకుని..

ఉగాది మహోత్సవాలకు మాత్రం కర్ణాటక రాష్ట్ర భక్తులు తమ తమ గ్రామాల నుండే ఆ పాదయాత్రగా శ్రీశైలం వస్తారు. అలాగే కొంతమంది భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకొని పాదయాత్రగా వచ్చి తమ భక్తిని చాటుతారు. కన్నడ భక్తులు తమ గ్రామంలోని ఇంటి వద్దనే అత్యంత పవిత్రమైన కంబికి విశేష పూజలు నిర్వహించి శ్రీ స్వామి అమ్మవార్లను కంబి పైకి ఆవహింప చేసుకొని కంబిని భుజాన మోస్తూ శ్రీశైల మహా క్షేత్రానికి పాదయాత్రగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. శ్రీశైలం మల్లన్న తమ ఇంటి అల్లుడని అమ్మవారు కన్నడ ఆడపడుచు అని కన్నడ భక్తులు ఉగాది బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా విచ్చేసి బ్రహ్మోత్సవాలు తిలకించి శ్రీ స్వామి అమ్మవాళ్ళని దర్శించుకుని తమ తమ స్వగ్రామాలకు తిరిగి వెళుతుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News