Friday, May 9, 2025
HomeతెలంగాణAmerica: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

అగ్రరాజ్యం అమెరికా(America)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. మృతదేహాలను త్వరగా స్వగ్రామం చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News