మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఆయన జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జిల్లాల పర్యటన ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే దానిపై క్లారిటీ రాలేదు. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.