మరో ఐదు రోజుల్లో ఐపీఎల్(IPL 2025) ప్రారంభకానుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీ డిజిటల్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్(JioHotstar)లో ప్రసారం కానుంది. అయితే ఇప్పటిదాకా ఫ్రీగా మ్యాచ్‌లు వీక్షించిన ప్రేక్షకులకు జియో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారులు కనీసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనే షరతు విధించింది. అయితే తాజాగా కస్టమర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్లపై 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చని ప్రకటించింది.
రూ.299, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్లాన్‌లపై ఈ ఆఫర్ అందిస్తుంది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ప్రసారాలను మొబైల్, టీవీల్లో 4కే స్ట్రీమింగ్ సేవలు పొందొచ్చు. మార్చి 17 నుంచి ఈనెల 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కాగా ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటికే జియో పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. రూ.100 ప్లాన్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే.