తెలంగాణ అసెంబ్లీ(TG Assembly) సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఈ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ జరుగుతున్న తీరును నిరసిస్తూ ఎంఐఎం(MIM) సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందని.. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? అని మండిపడ్డారు. ఇది గాంధీభవన్ కాదు.. తెలంగాణ శాసనసభ అని తెలిపారు.