Monday, March 17, 2025
HomeతెలంగాణMallanna: కేటీఆర్‌తో తీన్మార్ మల్లన్న భేటీ

Mallanna: కేటీఆర్‌తో తీన్మార్ మల్లన్న భేటీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Mallanna), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)తో అసెంబ్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్‌ రావు కూడా ఉన్నారు. ప్రభుత్వం సభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రశేపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్‌ను మల్లన్న కోరినట్లు సమచారారం. అలాగే మండలిలో ఈ అంశంపై తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఇటీవల ఓ సామాజికవర్గంపై ఘాటు వ్యాఖ్యలతో పాటు ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదిక పత్రాలను కాల్చివేసిన సంగతి తెలిసిందే. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News