అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవిల రెండో కుమార్తె ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు అర్విన్, ప్రగతి రెడ్డి అత్త సునీత లు మృతిచెందడం ఎంతో బాధాకరం. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో ఆ భగవంతుడు వారికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే, గాయపడిన రోహిత్ రెడ్డి, ఆయన చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.