నేడు ఢిల్లీ(Delhi)కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu), రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ నుంచి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నారు.
- Advertisement -
రాత్రి 7 గంటలకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి రిసెప్షన్ కు హాజరుకానున్నారు సీఎం, డిప్యూటీ సీఎం.
అనంతరం బుధవారం ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అమరావతి పున:ప్రారంభానికి ప్రధాని మోదీనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించనున్నారు.