మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్(Mankombu Gopalakrishnan) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేస్తున్నారు.
తాజాగా గోపాలకృష్ణన్ మృతిపై దిగ్గజ జదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. “మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త బాధించింది. ఆయన చిరకాల వాంఛనీయ సాహిత్యం, కవిత్వం, సంభాషణలు ఆయనపై శాశ్వత ముద్ర వేశాయి. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్లకు ఆయనతో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞతలు. ఓం శాంతి” అని ట్వీట్ చేశారు.