Tuesday, March 18, 2025
Homeచిత్ర ప్రభTarun Raj: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటుడు తరుణ్ రాజ్ అరెస్ట్

Tarun Raj: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటుడు తరుణ్ రాజ్ అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నటుడు తరుణ్‌ రాజ్‌(Tarun Raj)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా గోల్డ్ స్మగ్లింగ్‌ వెనుక కింగ్‌పిన్‌గా తరుణ్ రాజ్ ఉన్నాడని తేలింది. పలుమార్లు తరుణ్ రాజ్‌తో కలిసి రన్యారావు దుబాయ్ వెళ్లినట్లుగా గుర్తించారు. దుబాయ్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు తప్పించుకునేందుకు యూఎస్ పార్ట్‌పోర్ట్ ఉపయోగించాడని తేల్చారు. దీంతో తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

మరోవైపు ఈ స్మగ్లింగ్‌లో ఆమె సవతి తండ్రి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రామచంద్రరావును సెలవుపై వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తరుణ్‌ రాజ్ అరెస్ట్ కావడంతో ఈ స్మగ్గింగ్ వెనక కీలక పాత్రధారులు ఎవరు ఉన్నారో ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మొత్తానికి గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News