ఏపీ అసెంబ్లీ (AP Assembly) ఆవరణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫొటో సెషన్ నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు తర్వాతి వరుసల్లో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫొటో సెషన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నారు. ఫొటో సెషన్ అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను బాగున్నారా అంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పలకరించారు. ఈ సందర్భంగా ఇద్దరు కరచాలనం చేసుకుని వెళ్లిపోయారు.
AP Assembly: అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫొటో సెషన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES