అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. మహిళ దారుణ హత్య ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో ఫోన్ లో మాట్లాడారు హోంమంత్రి అనిత. తక్షణమే విచారణ చేసి, నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
బయ్యవరంలో ముక్క ముక్కలుగా మహిళ మృతదేహం (Dead body) పడి ఉండటంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. కశింకోట మండలం బయ్యవరంలో ఈ దారుణ ఘటన అందర్నీ కలవరపెడుతోంది. గుర్తు తెలియని ఓ మహిళను దుండగులు హతమార్చినట్లు తెలుస్తుంది. ఈ సంచలన సంఘటనలో శరీర భాగాలను నడుము నుండి కింద పార్టు వరకు వేరు చేసి దుపట్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి పరిశీలించిన పోలీసులు.. దుప్పట్లో ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని కశింకోట సీఐ స్వామి నాయుడు వెల్లడించారు.