ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు(Sports competitions) ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆటల పోటీలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు ప్రారంభించారు. మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, త్రోబాల్, టెన్నికాయిట్ క్రీడాంశాలతో పాటు అథ్లెటిక్స్ కూడా నిర్వహించనున్నారు. మొత్తం 13 రకాల క్రీడల్లో పోటీలు జరగనున్నాయి.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు 175 మంది ఎమ్మెల్యేల్లో 140 మంది… 58 మంది ఎమ్మెల్సీల్లో 13 మంది తమ పేరు నమోదు చేయించుకున్నారు. వైసీపీకి చెందిన సభ్యులు మాత్రం ఈ పోటీలకు దూరంగా ఉంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వారు ముగింపు రోజు పోటీలకు హాజరుకానున్నారు. ఇక చివరి రోజు సీఎం చంద్రబాబు విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారు.