తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడతారు. దీనికి ముందుగా ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు.
అనంతరం 11.14 గంటలకు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రాష్ట్రంలోని కీలక పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుతోపాటు మరో 5 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.