ఏపీలో దారుణం జరిగింది. ఓ హిజ్రాను దుండగులు అత్యాచారం చేసి ముక్కలుగా నరికి చంపిన ఘటన అనకాపల్లి జిల్లా వెలుగు చూసింది. పోలీసులు మెుదటగా ఓ గుర్తు తెలియని మహిళా మృతదేహన్ని స్వాధీనం చేసుకోగా వారి విచారణలో ఆమె దీప అనే హిజ్రా అని తేలింది.
అనకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఆమె శరీర భాగాలు లభించాయి. మిగతా భాగాల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. కాగా, నిందితుల కోసం 8 బృందాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు..
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి పరిశీలించిన పోలీసులు. ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని వెల్లడించారు.