క్షేత్రస్దాయిలో కార్యకర్తలను సమన్వయం కోసమే ఆత్మీయ సమ్మేళనం – మంత్రి కొప్పుల
క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమన్వయం కోసమే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు కేసిఆర్ గారి సంక్షేమ పధకాలు అందుతున్నాయి, దేశంలోనే తెలంగాణ పధకాలను ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రతి పక్షాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కొప్పుల ఆవేదన వ్యక్తంచేశారు. క్షేత్ర స్థాయిలో బి.ఆర్.ఎస్ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమన్వయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గారు, ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగీ అనీల్ కుమార్ గంద్రలయ చైర్మన్ రఘువీర్ సింగ్, నాయకులు ఈద శంకర్ రెడ్డి మూల విజయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.