Wednesday, March 19, 2025
HomeతెలంగాణTelangana Budget: బడ్జెట్‌లో డ్వాక్రా మహిళలకు శుభవార్త

Telangana Budget: బడ్జెట్‌లో డ్వాక్రా మహిళలకు శుభవార్త

ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అసెంబ్లీలో రూ. 3,04, 965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26(Telangana Budget) ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. ఇక వివిధ రంగాలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం.. డ్వాక్రా మహిళలకు నిధులు కేటాయించింది. వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు రూ.1511కోట్లు కేటాయించినట్లు భట్టి వెల్లడించారు. ఇక SDF/ CDP ఫండ్స్ కోసం రూ. 3, 300 కోట్లు కేటాయించారు.

- Advertisement -

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు. మహలక్ష్మీ పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణంలో భాగంగా రాష్ట్ర మహిళలకు రూ.5,005 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా రూ.433 కోట్లు ఆదా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుపై మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలోనే అత్యధిక శాతం మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News