Wednesday, March 19, 2025
HomeతెలంగాణTelangan Budget: తెలంగాణ శాస‌న‌స‌భ శుక్ర‌వారానికి వాయిదా

Telangan Budget: తెలంగాణ శాస‌న‌స‌భ శుక్ర‌వారానికి వాయిదా

తెలంగాణ శాస‌న‌స‌భ వాయిదా ప‌డింది. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభం అవుతుంద‌ని స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఉద‌యం 11.14 గంట‌ల‌కు ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అనంతరం 1:43నిమిషాల పాటు భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని చ‌దివి వినిపించారు. బడ్జెట్ అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలిపారు.

తిరిగి శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. మరో వైపు శాసన మండలి సైతం శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ తెలిపారు.

- Advertisement -

2025-26 బడ్జెట్ అంచనాలు:

మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు

వ్యవసాయ శాఖకు 24,439

పశు సంవర్ధక శాఖకు 1,674 కోట్లు

పౌరసరఫరాల శాఖకు 5,734 కోట్లు

విద్యాశాఖకు 23,108 కోట్లు

కార్మిక ఉపాధికల్పనకు 900 కోట్లు

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు

మహిళా శిశు సంక్షేమం కు 2,862 కోట్లు

షెడ్యూల్ కులాల సంక్షేమం కు 40,234 కోట్లు

షెడ్యూల్ తెగలకు 17,169 కోట్లు

వెనుకబడిన తరగతుల శాఖకు 11,405 కోట్లు

చేనేత రంగానికి 371 కోట్లు

మైనారిటీ సంక్షేమం కు 3,591 కోట్లు

పరిశ్రమల శాఖకు 3,527 కోట్లు

ఐటీ శాఖ కు 774 కోట్లు

విద్యుత్ శాఖకు 21,221 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు

మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు 17,677 కోట్లు

నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు

హోం శాఖకు 10,188 కోట్లు

దేవాదాయ శాఖకు 190 కోట్లు

అడవులు పర్యావరణ శాఖకు 1,023 కోట్లు

క్రీడాశాఖకు 465 కోట్లు

పర్యాటకశాఖకు 775 కోట్లు

రోడ్లు భవనాలు శాఖకు 5,907 కోట్లు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News