Wednesday, March 19, 2025
HomeతెలంగాణSeethakka: బడ్జెట్‌పై కేటీఆర్ విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్

Seethakka: బడ్జెట్‌పై కేటీఆర్ విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్

తెలంగాణ బడ్జెట్‌(Telangana Budget)పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) చేసిన విమర్శలకు మంత్రి సీతక్క(Seethakka) కౌంటర్ ఇచ్చారు. ఇది ఢిల్లీకి మూటలు మోసే బడ్జెట్ అంటూ కేటీఆర్ చేసిన వాఖ్యలు ఆయన మనసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు మూటలు మోసింది కేటీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ మూటలు తీసుకున్న వారంతా ఆగం అయ్యారని ఎద్దేవా చేశారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం మిలినీయమ్ జోక్ అన్నారు. రాష్ట్రాన్ని మోయలేనంత అప్పుల కుప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందన్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ బడ్జెట్ అంతా కోతల బడ్జెట్.. అందుకే ప్రజలు వాతలు పెట్టారన్నారు. ఇది బీఆర్ఎస్ మాదిరి భజన బడ్జెట్ కాదని.. మహిళలు, రైతులు, యువత, అట్టడుగు వర్గాల సంక్షేమ బడ్జెట్ అని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రతిబింబించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ అధిక నిధులు కేటాయించామన్నారు. గుంట భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.600 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరిపామని చెప్పారు. అలాగే మహిళా శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఎక్కువ నిధులు కేటాయింపు జరిగిందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఒత్తిడిలో ఉన్నా బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యతనిచ్చామని సీతక్క వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News