Friday, May 9, 2025
HomeఆటIPL: ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్..!

IPL: ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ శనివారం ఘనంగా ప్రారంభం కానుంది. కోల్‌కతా వాంఖడే స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనుంది. గత సీజన్‌లోని జట్లకు, ఇప్పుడు బరిలోకి దిగనున్న జట్లకు చాలా వ్యత్యాసం ఉంది. మెగా వేలం కారణంగా ఈ రెండు జట్లలో భారీ మార్పులు జరిగాయి. ఇరు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే KKR కెప్టెన్‌గా ఉండనుండగా, RCBకి రజత్ పటిదార్ నాయకత్వం వహించనున్నాడు.

- Advertisement -

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ 18వ సీజన్ లో తొలి పోరు శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆరంభ వేడుకలు జరుగుతాయి. బాలీవుడ్ తార దిశా పటానీ తళుక్కుమననుంది. సింగర్లు శ్రేయా గోషల్, పంజాబీ సింగర్ కరణ్ ఔజిలా తమ పాటలతో సందడి చేయనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే వర్షం ఈ మ్యాచ్‌కు ముప్పు కలిగించే అవకాశం ఉంది. దీంతో కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

మర్చి 22న (శనివారం) 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఉదయం నుంచే ఈడెన్ గార్డెన్ పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచే అవకాశాలు ఉన్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వర్షం పడే అవకాశం 10 శాతంగా ఉంది. 8 నుంచి 9 మధ్య 50 శాతం, 9 నుంచి 11 మధ్య 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది జరిగితే IPL 2025 తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News