Friday, September 20, 2024
HomeఆటHyd: గగన్ నారంగ్ ఫౌండేషన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

Hyd: గగన్ నారంగ్ ఫౌండేషన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని HCU లోని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS), గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హై పర్ఫామెన్స్ ట్రైనింగ్ సెంటర్ (HPTC) ఇంటర్నేషనల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ సంధర్బంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి సహకారంతో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. క్రీడాకారులకు, కోచ్ లకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. క్రీడా పాలసీ నీ రూపొందించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు నగదు పురస్కారాలను గణనీయంగా పెంచామన్నారు. క్రీడాకారులకు ఎంతో విలువైన జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో ఇళ్ల స్థలాలను కేటాహించామన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లను కల్పించామన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్టేడియాలను నిర్మిస్తునీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడారంగంలో తీసుకువచ్చిన మార్పుల వల్ల గత ఒలంపిక్స్ లో కామన్వెల్త్ క్రీడలలో తెలంగాణకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయిలో సత్తా చాటమనీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. క్రీడారంగంలో అద్భుత ఫలితాలను సాధించి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS), గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హై పర్ఫామెన్స్ ట్రైనింగ్ సెంటర్ (HPTC) ఇంటర్నేషనల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. Hyderabad ను ఇంటర్నేషనల్ షూటింగ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామనీ వెల్లడించారు. షూటింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు విదేశీ కోచ్ లను నియమించామన్నారు. ఇటీవల జరిగిన నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మెడల్స్ ను అందజేశారు. షూటింగ్ లో వచ్చే ఒలంపిక్ లో పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ 25 మీటర్ల రేంజ్ షూటింగ్ లో మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. సింగిల్ షాట్ తో 25 మీటర్ల టార్గెట్ ను పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News