Monday, March 31, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టమే: షర్మిల

YS Sharmila: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టమే: షర్మిల

డీలిమిటేషన్‌(Delimitation)పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. సౌత్ పార్టీలు ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా నియంత మోడీకి బుద్ధి రాదని విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదు. ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి.. సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పనిలేకుండా పోతుంది. సొమ్ము సౌత్ ది..సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదు. డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే… దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144. ఇది కాదా వివక్ష చూపడం అంటే ? యూపీ,బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే.. సౌత్ మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితం. ఇది కాదా దక్షిణ భారతంకి జరిగే అన్యాయం ?

డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా నియంత మోడీకి బుద్ధి రాదు. ఏపీలో మోడీ పక్షం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే. ప్రజల హక్కులను కాలరాసినట్లే. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు సైతం నోరు విప్పకపోవడం మోడీకి పరోక్ష మద్దతు అని ఒప్పుకున్నట్లే. డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టీ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ముందుకు రావాలి” అని షర్మిల పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News